ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు భారీ ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం ఆయన కాంగ్రెస్ నేతలు, అధికారులు తో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ్ అగర్వాల్ మరియు పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్‌మెంట్‌లో నిలిచిన సమయంలో అకస్మాత్తుగా అది కుంగింది. ఈ ఘటనా దృష్ట్యా అధికారులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్‌ను కింద పడకుండా బలంగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.


















