మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరవగా, స్వామివారు సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.



















