అందరి అభిప్రాయాలు, ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇద్దరు, ముగ్గురు కలిసిన చోట భిన్నాభిప్రాయాలు కనిపించడం సహజం. ఆ సమయంలో, ఎదుటివారి నొచ్చకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచడం ఒక నైపుణ్యం. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు—వివిధ సందర్భాల్లో సంభాషణలు, చర్చల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ సమయంలో, ఎదుటివారి అభిప్రాయం నచ్చకపోతే వెంటనే ఖండించాల్సిన అవసరం లేదు. సహనంతో ఆలోచనలను వినడం, మర్యాదగా భిన్నాభిప్రాయాన్ని తెలియజేయడం ముఖ్యం. భిన్న వాదనను సౌమ్యంగా, ఘర్షణ లేకుండా వ్యక్తపరచడం నేర్చుకోవాలంటే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.




















