మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని ఆయన స్వగ్రామ పూవర్తికి తరలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకొని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గ్రామం మొత్తానికి విషాద వాతావరణం నెలకొంది. హిడ్మా తల్లి పుంజి తీవ్ర వేదన వ్యక్తం చేశారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందగా, పోస్టుమార్టం తదితర ప్రక్రియల తర్వాత రెండు రోజులకే ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.



















