తిరువూరు: తిరువూరు మండలంలోని కట్టలేరు ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా ఘటన కలకలం రేపింది. టీడీపీ నాయకులు తమ సొంత పరిశీలనలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ఈ ఇసుకను ఖమ్మం జిల్లా కళ్ళూరు మండలానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ రవాణాకు ఎ.కొండూరు మండలం కంభం పాడు గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఈ ఘటనపై స్పందించిన తిరువూరు పోలీసులు, సంబంధిత ఇద్దరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రాంతంలో ఇసుక దందా పెరుగుతుండటంపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



















