సత్యసాయి జిల్లా కదిరి మండలం అలీపూర్ తాండాలో ఎక్సైజ్ పోలీసులపై నాటుసారా తయారీదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అలీపూర్ తాండాలో నాటుసారా తయారీ జరుగుతోందనే సమాచారం ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించడానికి వెళ్లారు. అయితే, తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుళ్లపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిందితులను గుర్తించి చర్యలు ప్రారంభించారు.



















