చిరంజీవిపై అభిమానుల ప్రేమ మరోసారి హృదయాలను హత్తుకుంటోంది. చిరు సినిమా అంటే అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతాయనడానికి ఇదే నిదర్శనం. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి (Chiranjeevi)పై అభిమానులు చూపిస్తున్న అభిమానానికి తాజాగా మరో రూపం కనిపించింది.
సినిమా విడుదలకు ముందు రామ్‌చరణ్ అభిమానులు చిరుపై రూపొందించిన ఓ ప్రత్యేక యానిమేషన్ వీడియోను నిర్మాత సుస్మిత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు స్పందిస్తూ,
“కాలం మారినా, తరాలు మారినా, ఆయనపై మీకున్న ప్రేమ, ఆప్యాయత, గౌరవం మాటల్లో చెప్పలేని అమూల్యమైన భావన” అంటూ అభిమానుల ప్రేమను కొనియాడారు.
ప్రస్తుతం ఈ యానిమేషన్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారుతూ, చిరంజీవిపై అభిమానులకు ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటిచెబుతోంది.



















