వైకాపా నాయకులు జగన్ మెప్పు కోసం నోటికొచ్చారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “అభివృద్ధిని అడ్డుకోలేని జగన్ రాష్ట్రం, ప్రజలపై కుట్రలు చేస్తున్నారు. వైకాపా అంతరించాల్సిన పార్టీ కావడంతో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరి నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రండి. వైకాపా ఎంత కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరు. వివేకా హత్య కేసులో దోషులను జగన్ రక్షిస్తున్నారు” అని అన్నారు.



















