ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాడు ఫేక్ ఫేస్బుక్ ఖాతా ద్వారా మోసానికి పాల్పడ్డాడు. సజ్జనార్ స్నేహితుడు దురదృష్టవశాత్తు 20,000 రూపాయలు పంపించారని తెలుసుకున్న ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.
సజ్జనార్ శనివారం తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి వెల్లడించారు:
“గమనిక: నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి, స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను, డబ్బులు పంపించండి’ అని సందేశాలు పంపిస్తున్నారు. నిజమే అనుకొని ఒక స్నేహితుడు 20,000 రూపాయలు పంపించారు. నా అధికారిక ఖాతీ లింక్: (https://www.facebook.com/share/1DHPndApWj/). మిగతా ఖాతాలు అన్ని నకిలీ ఖాతాలు.
ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీమ్ తొలగిస్తున్నది. నా పేరు లేదా ఇతర అధికారి/ప్రముఖుల పేరుతో వచ్చే ఫేస్బుక్ రిక్వెస్ట్‌లపై ఎప్పుడూ స్పందించవద్దు. డబ్బులు పంపమని వచ్చే సందేశాలను నమ్మకండి. ఎవరైనా అలాంటి మెసేజ్‌లు పంపితే, ముందుగా ఫోన్ ద్వారా ఆ వ్యక్తిని సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయండి. జాగ్రత్తగా ఉంటేనే మన డబ్బు, మనల్ని కాపాడుకోవచ్చు.”


















