పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పక పాల్గొనాల్సిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కార్యాలయ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన 48 మంది ఎమ్మెల్యేలు పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోవడం పై నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వివరణ సమర్పించిన తర్వాతే చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు. అలాగే, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల్ని కూడా కార్యక్రమాల్లో కలుపుకోవాలని సూచించారు.



















