అమరావతిలో మాట్లాడిన ఆయన, మెడికల్ కాలేజీల పేరుతో వైకాపా ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.1,550 కోట్ల నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. జగన్ హయాంలో ఐదేళ్లలో కేవలం 18 శాతం కాలేజీ భవనాల నిర్మాణమే జరిగిందని తెలిపారు.
చంద్రబాబు నాయుడు హయాంలో పీపీపీ మోడల్ ద్వారా కేవలం రెండేళ్లలోనే మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలమని ఆంజనేయులు అన్నారు.



















