“ఏమి అనుకోవద్దు” అని మనం ఒక మాట అన్నామంటే చాలు, ఆ మాటను పట్టుకుని చిన్నపిల్లల్లా ఏదో ఒకటి అడిగేస్తుంటారు. అడిగే ముందు పరిస్థితి ఏంటి, అవతలి వాళ్లకు ఇబ్బంది అవుతుందా లేదా అన్న ఆలోచన కాస్త మిస్సవుతుంది. మాటకు అర్థం ఉంది, ఆ మాట చెప్పిన మనసుకీ విలువ ఉంది. అన్నీ సహజంగా తీసుకోవడమే కాదు, కొంచెం అర్థం చేసుకోవడం కూడా అవసరమే.



















