కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు భారీగా తరలి వచ్చారు. విజయవాడ దుర్గాఘాట్‌లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ భక్తి పరవశంతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




















