కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటీకూరు సమీపంలో భయంకర బస్సు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (నంబర్ DD 01 N 9490) బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, ఆగిపోకుండా మంటలు వ్యాపించడంతో పలువురు సజీవ దహనానికి గురయ్యారు.
ఈ ఘటనలో 12 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భారీ వర్షం పడడం పరిస్థితిని మరింత కష్టతరం చేసింది.
ఘటనాస్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరి మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాద కారణంగా హైవేపై భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.




















