కేరళ సీఎం పినరయి విజయన్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి దారిద్ర్య రహిత రాష్ట్రంగా ప్రకటించారు. అత్యంత దుర్భరమైన పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళకు గుర్తింపు లభించిందని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
సరఫరాలపై ఆయన వివరాలు చెప్పారు: ఇప్పటివరకు 21,263 మందికి మొదటిసారిగా రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మంజూరుచేశారు. అదనంగా 4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ప్రజలందరికీ సమాన హక్కులు, నివాసం, విద్య, వైద్యం అందుతుందని సీఎం వెల్లడించారు. ఈ చర్యల వల్ల రాష్ట్రం అత్యంత దుర్భర పేదరికం నుండి బయటపడిందని పినరయి విజయన్ పేర్కొన్నారు.
అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఈ ప్రకటనను తప్పుబట్టాయి. ప్రభుత్వ ప్రకటించిన వివరాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్ మాట్లాడుతూ, సీఎం ప్రకటన “భారీ మోసం” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాక్‌ఔట్ చేశారు.




















