కేరళలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ బరిలో ఉన్నారని వినిపిస్తోంది. అయితే, ఆమె కాంగ్రెస్ నాయకురాలు కాదు, స్థానిక భాజపా నాయకుడి భార్య. ఆమెకు “సోనియా గాంధీ” అనే పేరు ఎలా వచ్చిందంటే… ఆమె తండ్రి దురేరాజ్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారు కాబట్టి చిన్నతనంలో ఆమెకు ఈ పేరు పెట్టారు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్త భాజపాలో క్రియాశీలకంగా ఉన్నాడు, అందువల్ల స్థానిక ఎన్నికల్లో భాజపా తరఫున ఆమె బరిలోకి దిగారు. ఇడుక్కి జిల్లా మున్నార్ పంచాయతీ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.




















