కర్నూలులో జరిగిన భయంకర బస్సు ప్రమాదానికి గురైన బస్సు DD01N9490, కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్టర్ చేయబడింది. ఈ బస్సును 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్టర్ చేసి, 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ చేయబడింది.
ప్రస్తుతం దర్యాప్తు ప్రకారం, ఈ బస్సు పూర్తిగా ఫిట్‌గా ఉంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ 2027 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే, బస్సుకు ఇన్స్యూరెన్స్ 2026 ఏప్రిల్ 20 వరకు ఉంది.
ప్రారంభ దర్యాప్తు నివేదికలో బస్సులో మంటలు రావడానికి ప్రధాన కారణం బైక్‌ను బలంగా ఢీకొట్టడమే అని గుర్తించబడింది. ఏపీ రవాణాశాఖ అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు కొనసాగిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపింది.



















