గోంగూర మొక్క సాధారణంగా నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది. అయితే, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, అప్పన్నపేటలో ఉన్న ఒక మొక్క 14 అడుగుల వరకు ఎదిగింది. విశ్రాంత ఉపాధ్యాయుడు అల్గుబెల్లి కృష్ణారెడ్డి-సరోజనమ్మల ఇంటి ఆవరణలో గుబురుగా పెరిగిన ఈ మొక్క, ఇతర చెట్లతో కూడా పోటీ పడుతోంది.
మొక్క కాండం లావుగా ఊరగా, మూడు అడుగుల ఎత్తు నుంచి కొమ్ములు విస్తరించాయి. మొక్కను వేసి తొమ్మిది నెలలయింది, ప్రస్తుతానికి దాదాపు 25 కొమ్ములు ఉన్నాయి. పెరీనియల్ ప్లాంట్ కావడం వల్ల ఇంత ఎత్తు సాధ్యమైందని, అరుదుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి ఉంటాయని ఉద్యాన విభాగ శాస్త్రవేత్త సీహెచ్. నరేశ్ తెలిపారు.


















