ఈ ప్రమాదం ఎన్‌డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో చోటుచేసుకుంది. పరిశ్రమ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిన్నింగ్ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన పత్తి పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.



















