కర్నూలు, 24-10-2025: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలానికి హోంమంత్రి వంగలపూడి అనిత మరియు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారణకు వెళ్లారు.
మంత్రుల వెంట డి ఐ జీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితర అధికారులు కూడా సహచరులుగా ఉన్నారు. మంత్రిలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తూ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.






















