ప్రకాశం జిల్లా, అక్టోబర్ 31: మొంథా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల పరిస్థితిని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పరిశీలించారు. మర్రిపూడి మండలంలోని రాజుపాలెం, అంకెపాలెం గ్రామాల్లో తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో సజ్జ, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, మిరప పంటలతో పాటు వరి, పెసర, పొగాకు పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. పంటల నష్టం వివరాలను సేకరించి, ప్రతి నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
తుపాను ప్రభావంతో దెబ్బతిన్న గ్రామీణ రహదారులను త్వరలోనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించామని చెప్పారు.
రైతులకు అన్ని విధాలా అండగా ఉండే ప్రభుత్వం ఇది అని మంత్రి డీఎస్‌బీవీ స్వామి స్పష్టం చేశారు.




















