మచిలీపట్నం సభకు వెళ్లే మార్గంలో మంత్రి నారా లోకేష్ గారు తన అమ్మమ్మ గారి ఊరిలో కాసేపు ఆగారు. అక్కడ బంధువులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా పలకరిస్తూ వారి మాటలు శ్రద్ధగా విన్నారు, సమస్యలు తెలుసుకున్నారు. ఎలాంటి ఆడంబరం లేకుండా అందరితో కలిసిమెలసి మాట్లాడిన లోకేష్ గారి సాన్నిహిత్యానికి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.



















