పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. కట్టుకాల్వ, యలమంచిలంక గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలను కలసి పరామర్శించి, వారికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – గతంలో తుపాను, వరదల సమయంలో రైతులను కలవడానికి బారికేడ్లు పెట్టుకున్న జగన్‌కు ఇప్పుడు అన్నదాతలను పరామర్శించే అర్హత లేదని అన్నారు. అప్పటి ప్రభుత్వ పాలనలో రైతులు తమ సమస్యలు చెప్పుకుంటే కేసులు పెట్టించేవారని విమర్శించారు. ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20 వేలు అందిస్తున్నామని గుర్తు చేశారు.



















