అంకితభావంతో, సేవాదృక్పథంతో విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మేథ్స్ స్కూల్ అసిస్టెంట్‌గా సేవలందిస్తున్న మోటూరి మంగారాణి మేడమ్‌కు హృదయపూర్వక అభినందనలు.తరగతి గదిలో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా బోధన చేస్తూనే, రైమ్స్, ఆటల ఆధారిత పాఠాలు, స్ఫూర్తిదాయక కథలు, 3D యానిమేషన్ వీడియోలను రూపొందించి “Mangarani Lessons” యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను చేరువ చేస్తున్నారు. ఈ కృషికి హ్యాట్సాఫ్ మేడమ్.లాలాచెరువు ప్రైమరీ స్కూల్ నాల్గవ తరగతి విద్యార్థి సత్తి చరణ్ తేజ్ ఇటీవల ప్రమాదానికి గురైన సమయంలో, సహ ఉపాధ్యాయులతో కలిసి విరాళాలు సేకరించి వైద్య సహాయం అందించిన మీ సేవాస్ఫూర్తి అభినందనీయం.టెక్స్ట్ బుక్ రైటర్‌గా, టీచర్ ట్రైనర్‌గా సేవలందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తున్న మంగారాణి మేడమ్ లాంటి ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కల సాకారం అవుతుంది.



















