గోదావరి పుష్కరాల పై రాజమండ్రిలో అధికారులతో చర్చ చేసిన రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఈ సందర్భంగా శాఖాపరమైన విధానాలపై వారికి దిశానిర్దేశం చేశారు. పుష్కరాలపై తక్షణమే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అంతేకాక, కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నట్లు, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి తెలిపారు. సదస్సులో ఆమెకు రెండు అరుదైన గౌరవాలు లభించాయని తెలిపారు.
అణుశక్తి, అణుబాంబుల తయారీ విషయంలో భారతదేశ నిర్ణయాన్ని గుర్తు చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ప్రజల స్పష్టమైన సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు.
రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని, పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని తెలిపారు. కొవ్వూరులో రెండు రైళ్లు, అనపర్తి జన్మభూమి రైలు హాల్ట్ సాధించామని, మొంథా తుఫాను కారణంగా వాటిల్లిన నష్టంపై కేంద్రంతో చర్చించానని వివరించారు.



















