మూడో రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు శాంతిపురం నివాసంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు గంటలపాటు ప్రతి ఒక్కరి సమస్యలను ఓపిగ్గా విని స్పందించారు. భారీ సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చి తమ అర్జీలను సమర్పించగా, భువనేశ్వరి గారు స్వయంగా అర్జీలను స్వీకరించారు. భర్తను కోల్పోయిన మహిళలకు అండగా నిలవాలని నియోజకవర్గ నాయకులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే చిన్నారులకు నామకరణం చేసి కుటుంబాలకు ఆనందాన్ని పంచిన భువనమ్మ.























