గుత్తార్లపల్లిలో నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “మా మాటగా చెప్పు భువనమ్మ” అంటూ ఫ్లకార్డులు పట్టుకొని కుప్పం మహిళలు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. హంద్రినీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కుప్పం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.నారా భువనేశ్వరి పర్యటన సందర్భంగా స్థానికులు తమ సమస్యలు, అవసరాలను ఆమెకు తెలియజేశారు. ప్రజలతో భేటీ అయిన ఆమె, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరింత మందికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని అభివృద్ధి పనులను కూడా పరిశీలించి, ప్రజల అభిప్రాయాలను ఆసక్తిగా ఆరాతీశారు.


























