లండన్ :-
ఐఓడి సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి.
లండన్ లోని మే ఫెయిర్ హాలులో అవార్డుల ప్రదానం కార్యక్రమం.
ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.
ప్రజా సేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరికి అవార్డు.
హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు.
హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి.
జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపిక చేసిన ఐఓడి సంస్థ


















