మంగళగిరి భోగి ఎస్టేట్స్‌లోని మంత్రి నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో నిన్న రాత్రి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబురాలు చేశారు.
జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అంతా ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
క్రీడా ప్రాంగణం అంతా వెలుగుల అలంకరణతో ప్రత్యేకంగా ముస్తాబైంది. ఈ వేడుకలు మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంత్రి నారా లోకేష్ గారి జన్మదినాన్ని అభిమానులు సేవా కార్యక్రమాలు, సంబురాలతో జరుపుకోవడం విశేషం.


















