తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు టోకెన్ కేటాయింపు విధానంలో తితిదే మార్పులు చేసింది. ఇంతకుముందు రోజుకు 750 టోకెన్లు ఆన్‌లైన్ డిప్ విధానంలో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి, ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై మూడు నెలల ముందుగానే టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయని, ఈ మార్పును గమనించి తగినట్లుగా బుకింగ్ చేసుకోవాలని తితిదే భక్తులకు సూచించింది.


















