కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రధాన రహదారులపై QR కోడ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ చర్యతో రోడ్ల నిర్మాణంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని ఆయన చెప్పారు.
దిల్లీలో “స్మార్ట్ రోడ్ల భద్రత” అంశంపై జరిగిన సమావేశంలో గడ్కరీ చెప్పారు, పౌరులు QR కోడ్ స్కాన్ చేస్తే ఆ రోడ్ల నిర్మాణంలో పని చేసిన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, మంజూరు చేసిన బడ్జెట్, గడువు, నిర్వహణ వంటి కీలక వివరాలు తెలుసుకోవచ్చు.
గడ్కరీ చమత్కరంగా పేర్కొన్నారు, “రోడ్లు బాగుండకపోతే అందరూ నన్నే నిందిస్తారు. మొత్తం వ్యవస్థ చేసిన తప్పులకి నేను ఒక్కరికే ఎందుకు తిట్లు తినాలి? సోషల్ మీడియాలో ఆరోపణలకి ఎందుకు స్పందించాలి?” అందుకే రోడ్ల సంబంధిత సమాచారాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని నిర్ణయించాము.
QR కోడ్‌ల ద్వారా ప్రజలు, విలేకర్లు, సంబంధిత రోడ్లపై సమస్య వచ్చినా, దాన్ని మంజూరు చేసిన మంత్రి, నిర్మాణం కోసం పని చేసిన కార్యదర్శులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లను నేరుగా ప్రశ్నించగలరు. ఈ విధంగా రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలతో సమక్షంగా accountability ఏర్పడుతుందని గడ్కరీ తెలిపారు.




















