జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు ఈ రోజు ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మద్యాహ్నం 3 గంటల లోపు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు అనుమతి ఇచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది.
ఉపఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న నిర్వహించబడనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. ఈ ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగుతుండటంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది.


















