అమరావతి – గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
జెండా ఆవిష్కరణ అనంతరం భద్రతా సిబ్బంది, అధికారులకు స్వీట్లు పంచి, వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయంగా, గౌరవప్రదంగా జరిగింది.
దేశ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరంపరలను గుర్తు చేస్తూ నిర్వహించిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















