డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించబోయే వైకుంఠద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు, సామాన్య భక్తులకు ముఖ్య ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, 10 రోజులకి మొత్తం 182 గంటలు అందుబాటులో ఉంటుందని, అందులో 164 గంటలు సాధారణ భక్తులకే కేటాయించినట్లు చెప్పారు. రూ.300, శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. భక్తులు తితిదే ఇచ్చిన సూచనలను పాటించి, ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



















