అనంతపురం: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపిస్తూ చెప్పారు — పరిటాల సునీత నేతృత్వంలో ల్యాండ్ మాఫియా కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. పాపంపేట గ్రామంలోని సుమారు రూ.6 వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసేందుకు ఆమె కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.
ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని తోపుదుర్తి మండిపడ్డారు. ఇంత పెద్ద స్థాయిలో భూముల కబ్జాలు జరుగుతున్నా, అనంతపురం కలెక్టర్ మౌనం ఎందుకు వహిస్తున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
భూకబ్జా మాఫియాపై తమ పోరాటం కొనసాగుతుందనీ, పాపంపేట ప్రజల భూములు రక్షించేవరకు తమ ధర్మయుద్ధం ఆగదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.



















