రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల భాగంగా చిత్రబృందం చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసింది.
‘చికిరి చికిరి’ అనే ఈ పాట 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధించింది. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో ఇండియన్ సినిమా చరిత్రలో ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన మొదటి పాటగా రికార్డు నెలకొల్పింది. అదేవిధంగా, కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించి, పూర్వపు రికార్డులను తాకింది.
ఈ పాటకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరచగా, మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ సాహిత్యం అందించారు. జానీ నృత్య దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన స్టెప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జానపద శైలిలోని ఉత్సాహభరిత సంగీతాన్ని ఆధునిక టచ్‌తో మిళితం చేసిన రెహమాన్, రామ్‌చరణ్ డ్యాన్స్‌తో పాటను మరింత ఆకర్షణీయంగా మార్చారు. జాన్వీ కపూర్ అందం కూడా ఈ పాటకు ప్రత్యేక ప్రభావం ఇచ్చింది.




















