నిజమైన సాధకుడి లక్షణం
మన విధులన్నీ చేయాలి, అన్నీ నిర్వర్తించాలి, కానీ మన మనస్సును మాత్రం భగవంతునిపై ఉంచాలి…. భార్య మరియు పిల్లలు, తండ్రి మరియు తల్లి – అందరితో జీవించాలి, మరియు వారికి సేవ కూడా చేయాలి, వారు మనకు చాలా ప్రియమైనవారిగా భావించాలి. కానీ ఎప్పటికి వారు మనకు చెందిన వారు కాదని మన హృదయం ద్వారా తెలుసుకోవాలి,
ఒక ధనవంతుని ఇంట్లో పనిమనిషి అన్ని గృహ విధులను నిర్వహిస్తుంది, కానీ ఆమె ఆలోచనలు తన స్వగ్రామంలోని తన సొంత ఇంటిపైనే వుంటాయి, ఆమె తన యజమాని పిల్లలను తన స్వంత వారిలాగా పెంచుకుంటుంది… ఆమె వారిని ‘నావారు’ అని కూడా మాట్లాడుతుంది, అలానే వారిని ‘నా రాముడు’ లేదా ‘నా హరి’ అని అంటుంది. కానీ ఆమె మనసుకు బాగా తెలుసు వారు తనకు చెందినవారు కాదని, అలానే భక్తుడు అనే వాడు, భగవంతుడే శాశ్వతం అని భావించాలి…
శుభమస్తు
సమస్త లోకాః సుఖినోభవంతు




















