జపాన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు హెచ్.ఎస్. ప్రణయ్, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. బుధవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 21-12, 21-16తో కొకి వతనబె (జపాన్) పై విజయం సాధించి, ప్రణయ్ 16-21, 21-13, 23-21తో లియోంగ్ జున్ (మలేసియా)ను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్ చేరారు.
ఇక ఇతర భారత క్రీడాకారులు: ఆయుష్ శెట్టి 16-21, 11-21తో కొడయ్ నరవొక (జపాన్) చేతిలో, తరుణ్ మన్నెపల్లి 9-21, 19-21తో జియోన్ జిన్ (కొరియా) చేతిలో, కిరణ్ జార్జ్ 20-22, 10-21తో జింగ్ హాంగ్ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-గద్దె రుత్విక శివాని జోడీ 12-21, 21-19, 20-22తో ప్రెస్లీ స్మిత్-జెన్నీ గాయ్ (అమెరికా) జంటకుఛిన్న తేడాతో పరాజయం చవిచూశారు.




















