పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో శ్రీదేవి భూదేవి సమేత బాల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పులిహోర, పండ్లు, మిఠాయిలు, పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు.




















