డీఎస్పీ దేవకుమార్, సీఐ కె. విశ్వం వివరాల ప్రకారం, ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పైకి చేరుకున్నప్పుడే సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు మరియు నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారుగా రూ. 80 లక్షల నష్టం జరిగినట్లు కొవ్వూరు అగ్నిమాపక అధికారి ఏవీఎన్ఎస్ వేణు తెలిపారు.



















