ఈటీవీ విన్ ఒరిజినల్స్’లో రూపొందిన కొత్త సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్, తేజస్విని జంటగా నటించారు. సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని రాహుల్ మోపిదేవ్‌తో కలిసి వేణు ఊడుగుల నిర్మించారు. ప్రమోషనల్ ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.




















