ఈ నెలాఖరున హీరో రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పీ. మహేశ్ బాబు తెరకెక్కించగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
శుక్రవారం ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్ “చిన్ని గుండెలో” ను విడుదల చేశారు. ఈ పాటకు వివేక్–మెర్విన్ స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. మెర్విన్ సోలమన్ మరియు సత్య యామిని ఈ గీతాన్ని ఆలపించారు. ఈ సాంగ్‌లో రామ్–భాగ్యశ్రీ జంట కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వినూత్నమైన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. మొదట ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ముందుగానే — ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.




















