ఇంటర్నెట్ డెస్క్:
పశ్చిమబెంగాల్‌లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కోల్‌కతాలో ఆర్జీకర్ వైద్యురాలితో పాటు మరో న్యాయ విద్యార్థిని పై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. తాజాగా మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడం ఆందోళనను మరింత పెంచుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం:
ఒడిశాకు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపుర్‌లోని శోభాపూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం చేసేందుకు తన ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ క్యాంపస్ నుంచి బయటికు వెళ్లిన సమయంలో కొందరు దుండగులు వారిని వెంబడించారు. ఫ్రెండ్ భయపడి పారిపోగా, దుండగులు బాధితురాలను సమీప అడవిలో లాక్కెళ్లారు. అక్కడ వారిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరి బాధితురాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, వైద్య కళాశాల సిబ్బంది, యువతి స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విశ్లేషణాత్మక దర్యాప్తు కొనసాగుతున్నది
ఇటీవల సౌత్ కోల్‌కతాలోని లా కళాశాలలో ఒక న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటన అధికార త్రినమూల్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. దీకాకముందు, ఆర్జీకర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై చోటుచేసుకున్న అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది.



















