‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రేక్షకులతో పూర్తి స్థాయిలో కనెక్ట్ అవుతోందని, అది తనకే పెద్ద అవార్డుగా ఉందని రష్మిక తెలిపారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను ప్రారంభంనుండి సపోర్ట్ చేస్తున్నారు అని, అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలన్నారు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలోని ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సినిమాకు సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. రష్మిక మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఎవరూ తప్పులు చేయడం లేదని, అందరూ కథతో పూర్తిగా కనెక్ట్ అవుతున్నారని, ఇది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు.




















