రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రధాన ప్రాజెక్టుల ప్రగతి, మరియు ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చిస్తూ, సమగ్రమైన సమీక్ష జరిపి, భవిష్యత్ కార్యాచరణలకు దిశానిర్దేశం చేశారు.


















