ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, కృష్ణానదిలో వరద ఉధృతి వేగంగా పెరుగుతోంది. అక్టోబర్ 30, 2025 మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కలిపి సుమారు 3,97,250 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఆయన పేర్కొంటూ – “కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలి,” అని హెచ్చరించారు.
అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అవసరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కృష్ణానది ప్రవాహం వేగంగా పెరుగుతోంది!



















