కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి పడింది. ఈ ప్రమాదంలో విజయవాడ, కుందేరు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు వచ్చినందున ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలన చేశారు. అత్యధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



















