ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. రోహిత్ ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించగా, కోహ్లీ కూడా అర్ధశతకం నమోదు చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ వరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరంగా ఉండనున్నారు, ఎందుకంటే వారు ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు.
వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు తమ కెరీర్‌ను కొనసాగించాలనే ఉద్దేశం రోహిత్, కోహ్లీకి ఉన్నా, మేనేజ్‌మెంట్ వారు తిరిగి ఎంపిక అవుతారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్–కోహ్లీ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు.




















