మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్రవాయుగుండం తుపాన్లుగా బలపడింది. దీని పేరును ‘సెన్యార్’గా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నిర్ణయించింది. ఇది వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనమవ్వవచ్చని సూచిస్తున్నారు. తూర్పు దిశగా కదులుతూ, ఇవాళ మధ్యాహ్నానికి ఇండోనేషియా తీరానికి చేరనుంది. నిపుణుల ప్రకారం, దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు. మరోవైపు, శ్రీలంక సమీపంలోని బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని అంచనా.



















