సోమవారం తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్, నటుడు రోషన్ కనకాల వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వెంటనే స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.



















